ఏపీ ఎంపీల నిరసనకు మా మద్దతిస్తున్నాం!: తెలంగాణ ఎంపీ కవిత

  • ఈరోజు లోక్ సభలో మాట్లాడిన కవిత
  • తెలంగాణ, ఏపీకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
  • దేశానికి ‘రాంగ్ మెస్సేజ్’ వెళ్లకుండా ఉండాలంటే సమస్యను తక్షణం పరిష్కరించాలి : కవిత
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ఎంపీలు చేస్తున్న నిరసనకు తమ మద్దతిస్తున్నామని తెలంగాణ అధికార పార్టీ ఎంపీ కవిత అన్నారు. ఈరోజు లోక్ సభలో ఆమె మాట్లాడుతూ, విభజన సమయంలో తెలంగాణ, ఏపీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రా సోదరులు టీడీపీ, వైసీపీ ఎంపీలు రెండుమూడ్రోజులుగా చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

మిత్రపక్ష ఎంపీలు ఈ రకంగా నిరసన, ఆందోళన చేపడుతుంటే దేశానికి ‘రాంగ్ మెస్సేజ్’ వెళుతుంది కనుక, ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు. వ్యవసాయానికి కేంద్రం ప్రాధాన్యమివ్వాలని, ఎరువుల సబ్సిడీని రైతులకు నేరుగా ఎందుకివ్వడం లేదని, ఫర్టిలైజర్ కంపెనీలకు సంబంధించి నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను నేడు బీజేపీ ఎందుకు చేస్తోందని కవిత ప్రశ్నించారు.
Go Back to Shorts
TRS
Telugudesam
K Kavitha

More Telugu News